మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో రికార్డు

2చూసినవారు
మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో రికార్డు
ఉమ్మడి మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ రికార్డు స్థాయిలో పూర్తయింది. ఏప్రిల్‌లోనే మూడు నెలల కోటాను లబ్ధిదారులకు అందించారు. 10 లక్షలకుపైగా కార్డుల్లో 9 లక్షలకుపైగా కుటుంబాలకు 58,696 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. పంపిణీ శాతం 90.84కు చేరి రికార్డు సృష్టించింది. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున బియ్యం ఇచ్చారు. జులై వరకు మళ్లీ పంపిణీ ఉండదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్