సీఎం కప్ క్రీడల నిర్వహణపై సమీక్ష, 16లోగా రిజిస్ట్రేషన్లు

1చూసినవారు
సీఎం కప్ క్రీడల నిర్వహణపై సమీక్ష, 16లోగా రిజిస్ట్రేషన్లు
మెదక్ జిల్లాలో సీఎం కప్ క్రీడల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేష్ మండల విద్యా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. క్రీడల అవగాహన కోసం ఈనెల 12 వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్