చిన్నశంకరంపేట మండలంలో అంబోజిపేట్–గువ్వలపల్లి చౌరస్తా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.