మక్కరాజుపేటలో పోలీసులు రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన దంపతులు ఈ డబ్బును బైక్‌పై తీసుకెళ్తుండగా, పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలో పోలీసులు వారిని గుర్తించారు. దంపతులు పొలం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు అని తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.