సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. టేక్మాల్ మండల కేంద్రంలో శనివారం జరిగిన సంతలో, సాధారణంగా రూ. 400-600 పలికే కోడి పుంజు ధరలు ఇప్పుడు రూ. 1000-1300కు చేరాయి. పండుగ డిమాండ్‌ను అడ్డం పెట్టుకుని విక్రయదారులు ధరలను పెంచారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.