మెదక్ జిల్లా, నిజాంపేటలో ‘హమారీ అంగన్వాడీ–హమారీ జిమ్మేదారీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్వకుంట సర్పంచ్ కొండల్‌రెడ్డి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. కేంద్రాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ నిర్వాహకులు, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.