గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యేను కోరిన సర్పంచ్

0చూసినవారు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను గురువారం మద్దూర్లో సర్పంచ్ దివ్యా లింగం గౌడ్ కలిసి, గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యేను కలిసి గ్రామ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే రోహిత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్