మెదక్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, నామినేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.