
ప్రియుడి భార్యపై ప్రియురాలు హత్యాయత్నం
AP: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తవణంపల్లి మండలం బోయపల్లి గ్రామంలో దిలీప్ భార్య రోజాపై ఆమె ప్రియురాలు భాను, స్నేహితురాలు తులసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివాహేతర సంబంధానికి రోజా అడ్డు వస్తుందన్న కారణంతో, ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజా నోట్లో గుడ్డ కుక్కి, బండరాయితో తలపై కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. రోజా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. తీవ్ర గాయాలైన రోజాను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాను, తులసిలను అరెస్ట్ చేశారు.




