గణేష్ నిమజ్జనానికి నిజాంపేటలో మల్కా చెరువు వద్ద పక్కా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల రక్షణలో పంచాయతీ పాలకవర్గం చెరువును పరిశీలించి నిమజ్జనానికి మొదటి భాగాన్నే వినియోగించాలని సూచించారు. ఎవరూ లోతులోకి వెళ్లకుండా, కట్ట నుంచి తూము వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. పొదలు తొలగించి విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయడంతోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చలిమేటి నరేందర్ మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు పోలీసులకు, పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు.