మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు, మంగళహారతి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.