మెదక్ మున్సిపల్ కో-ఆప్షన్ పదవులకు రేపు ప్రత్యేక సమావేశం

5చూసినవారు
మెదక్ మున్సిపల్ కో-ఆప్షన్ పదవులకు రేపు ప్రత్యేక సమావేశం
మెదక్ పురపాలక సంఘంలో 4 కో-ఆప్షన్ పదవుల కోసం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు పురపాలక సంఘ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 32 మంది కౌన్సిలర్లు ఉండగా, కాంగ్రెస్ బలం 21కి చేరింది. బీఆర్ఎస్ బలం 15 నుంచి 9కి తగ్గింది. 12 మంది పోటీలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయంగానే ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్