మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గం
టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి గ్రామంలో శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి కల్యాణోత్సవంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మెన్ మఠం బిక్షపతి పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.