వింత ఘటన

1090చూసినవారు
వింత ఘటన
శివంపేట్ మండలం తాళ్లపల్లి తండాలో ఒక కోడి మూడు కాళ్లతో జన్మించి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుగులోత్ రమేశ్ అనే రైతు తన పౌల్ట్రీ ఫారంలో పెంచుతున్న 25 రోజుల వయస్సున్న ఈ కోడికి మూడు కాళ్లు, రెండు మలద్వారాలు ఉన్నాయని గుర్తించారు. ఆదివారం ఈ వింత విషయం గ్రామంలో తెలియడంతో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో కోడిని చూడటానికి తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్