గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఆయన, కలహాలు రేకెత్తించేవారిపై బైండోవర్, సోషల్ మీడియాలో విద్వేష పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం, నగదు పంపిణీని పూర్తిగా అరికట్టనున్నట్టు తెలిపారు.