జంగరాయిలో వృద్ధ దంపతులైన సావిత్రి, అంజయ్యలపై దాడి చేసి నాలుగున్నర తులాల బంగారం దోచుకెళ్లిన కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది పరాయి వ్యక్తి కాదని, వారి స్వయాన మనవడే నిందితుడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 25న జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కుటుంబంలోనే జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.