చీలపల్లి చోరీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

1చూసినవారు
పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14.2 తులాల బంగారం, 87 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వర్ని, నస్రుల్లాబాద్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోనూ పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్