రామాయంపేటలోని మెదక్ చౌరస్తా వద్ద ఐరన్ లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.