రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

837చూసినవారు
రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
మెదక్ జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యలకు పరిష్కరించడానికి రేపు (బుధవారము) ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మెదక్ విద్యుత్ కార్యాలయంలో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌ కె.దిలీప్ కుమార్, మెంబెర్స్ (సీజీఆర్ఎఫ్) హాజరై వినియోగదారులతో నేరుగా మాట్లాడతారు. విద్యుత్ సమస్యలు లో వోల్టేజ్, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ మరిన్ని సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సదస్సులో పాల్గొనాలని ఆపరేషన్ సర్కిల్/టిఎస్ఎస్పిడిసిల్ మెదక్ సూపెరింటెండెంట్ ఇంజనీర్ జానకి రాములు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్