చిన్నశంకరంపేట మండలం సూరారంలోని శ్రీ నిత్య కోళ్లదాణా పరిశ్రమను తహశీల్దార్ మాలతి, ఎస్సై శివానందం, వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాణా తయారీలో ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, నిల్వలు, రికార్డులను పరిశీలించారు. అధికారులు నిషేధిత రసాయనాలు లేదా ఎరువులు కలుపుతున్నారా అనే అంశంపై యాజమాన్యాన్ని ప్రశ్నించారు.