టేక్మాల్ మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో శనివారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సుదీక్ష–కార్తీక్ విజయ్ గోపాల్ దంపతుల చేతుల మీదుగా ఆలయ పూజారులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలయ ప్రాంగణాన్ని భక్తి శ్రద్ధలతో పండగ వాతావరణంతో నింపారు.