అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి గ్రామంలో గ్రామ బాలల సంరక్షణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ పద్మలత మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్తులు సహకరించాలని ఆమె కోరారు.