ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలని సంఘం నాయకురాలు కుమ్మరి స్వప్న డిమాండ్ చేశారు. జీవో నం. 58ను వెంటనే రద్దు చేయాలని, పని భారాన్ని తగ్గించేందుకు ట్యాబ్‌లు అందించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వీవోఏలు సమ్మె చేపట్టినట్లు ఆమె తెలిపారు.