వానాకాలం సీజన్ నేపథ్యంలో ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నాయని తహశీల్దార్ మాలతి తెలిపారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల ప్రకారం యాప్ ద్వారానే ఎరువుల అమ్మకాలు జరపాలని సూచించారు.