జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ క్రైమ్ కు సంబంధించిన 65 కేసులు నమోదు కాగా 60 కేసులకు సంబంధించిన రూ. 12,43,343 బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత వారం రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున ఈ కేసులు పరిష్కరించబడినాయని తెలిపారు.