కంటైనర్ ఢీకొని మహిళ మృతి

783చూసినవారు
కంటైనర్ ఢీకొని మహిళ మృతి
చేగుంట శివారులో రోడ్డు ప్రమాదంలో కర్నే మంజుల (30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పొలం వద్దకు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటుతుండగా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఆమెను ఢీకొట్టింది. శనివారం మృతురాలి భర్త లచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్