మహిళా రైతులు ఆధునిక పద్ధతులతో ఆర్థికంగా ఎదగాలి

0చూసినవారు
మహిళా రైతులు ఆధునిక పద్ధతులతో ఆర్థికంగా ఎదగాలి
మెదక్ జిల్లా నిజాంపేటలో ఆత్మ సౌజన్యంతో మహిళా రైతులు, ఐకేపీ మహిళా బృందాలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. పెరటి తోటల పెంపకం, సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్ మెలకువలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం అశోక్, ఏఓ ప్రవీణ్ కుమార్, ఏఈఓ శ్రీలత, ఐకేపీ సిసిలు, మహిళా రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్