రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండాలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హలవత్ ప్రకాష్ కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్యే రోహిత్ రావు పరామర్శించారు. ప్రకాష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ కార్యకర్తలు పార్టీకి బలమని, కష్టకాలంలో వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.