సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగురవేయవద్దని వెల్దుర్తి మండల విద్యుత్ శాఖ అధికారి పెంట్యా నాయక్ సూచించారు. విద్యుత్ లైన్ల వద్ద పతంగులు ఎగురవేస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. కేవలం ఖాళీ ప్రదేశాల్లోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియో సందేశం ద్వారా హెచ్చరించారు.