తాళ్లపల్లి తండాలో వింత కోడి.. చూసేందుకు పోటెత్తిన ప్రజలు

880చూసినవారు
శివంపేట మండలం తాళ్లపల్లి తండాలో గుగులోత్ రమేశ్ అనే రైతు తన పౌల్ట్రీ ఫారంలో పెంచుతున్న 25 రోజుల వయస్సున్న ఒక కోడి మూడు కాళ్లు, రెండు మలద్వారాలతో జన్మించింది. ఈ అరుదైన సంఘటనతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యానికి గురై, కోడిని చూసేందుకు తరలివస్తున్నారు. జన్యుపరమైన లోపం వల్లే ఇలాంటివి జరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్