నర్సాపూర్లో షాడో ప్యాక్స్ టెక్నాలజీస్ కార్యాలయంలో క్యాష్ యర్గా పనిచేస్తున్న మేడి శ్రీధర్, తన బంధువు సాయినిరవితో కలిసి రూ. 2,66,850 నగదు, డీవీఆర్ను దొంగిలించాడు. ఆదివారం రాత్రి కార్యాలయం వెనుక తలుపులు ధ్వంసం చేసి, సీసీ కెమెరాలను బంద్ చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. సోమవారం నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, అనుమానాస్పదంగా కనిపించిన శ్రీధర్, సాయిలను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. నగదుతో పాటు డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన మూడు గంటల్లోనే నిందితులను అరెస్టు చేయడం విశేషం.