వెల్దుర్తి పీహెచ్‌సీలో ఏఎన్ఎం రజిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పని ఒత్తిడి, వైద్యుల మానసిక వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధుల్లో అధిక ఒత్తిడి, తరచూ మందలింపులు కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.