సిట్ నోటీసులపై నర్సాపూర్‌లో బీఆర్ఎస్ ధర్నా

1చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ పాలనను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచారణల పేరిట ఆయనను అవమానిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం నర్సాపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టేందుకే ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :