గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, నిజానిజాలు వెలికితీయడానికి హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.