నర్సాపూర్ బస్టాండ్‌లో ఆదివారం బస్సు, బోర్వెల్ లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న చెప్పుల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయి, బస్టాండ్ పరిసరాల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు వెంటనే చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.