తూప్రాన్ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అకస్మాత్తుగా వేగం తగ్గడంతో వెనుక వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడకపోయినా, వాహనాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల కొంతసేపు హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.