నర్సాపూర్ నియోజకవర్గం పంబండ గ్రామంలో ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. గర్భిణీల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. అనంతరం పంబండ, ఉసిరికపల్లి, హంసన్‌పల్లి, వెంకటాపూర్, దేవులపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.