ఏడుపాయల ఆలయం జలదిగ్బంధం, అమ్మవారికి మహిషాసురమర్దిని అలంకరణ

536చూసినవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాతను మహిషాసురమర్దిని రూపంలో అలంకరించారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు సందర్శిస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏడుపాయల ఆలయం 50 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. మా దుర్గా నుంచి 1.06 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, గర్భగుడి ముందున్న నదిపాయ అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్