శివంపేట సమీపంలో ఈ నెల 9న గాయపడిన గుర్తు తెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించిన అతడిని మొదట సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.