పోలియో చుక్కలతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసా

0చూసినవారు
వెల్దుర్తిలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తులో పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్