తిమ్మాపూర్ గేట్ హైవేపై రైతుల ధర్నా

0చూసినవారు
కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేట్ వద్ద రైతులు హైవేపై ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు నిల్వ ఉండిపోయినా లారీలు పంపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే లారీలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్