
కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం వెనుకున్న అసలు కథ ఇదే!
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని విజయ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ గుడి వెనుక ఓ కథ ఉంది. ఈ ఆలయాన్ని హరిముకుంద్ పండా అనే భక్తుడు నిర్మించారు. ఆయనకు మోకాళ్ల నొప్పులు ఉండటంతో తిరుమలకు వెళ్లి దర్శనం సంతృప్తికరంగా చేసుకోలేదట. దీంతో ఆయన తల్లి సలహా మేరకు స్వగ్రామంలోని కొబ్బరి తోటలో 12 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం ఈ ఏడాది మే నెల నుంచి భక్తుల దర్శనార్థం ప్రారంభమైంది.




