ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం గాయపడి సోమాజిగూడ యశోధ హాస్పిటల్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. ఎమ్మెల్యే సతీమణి నీలిమ ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరగా కోలుకుని జనజీవనంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.