గురుపౌర్ణమి సందర్భంగా అంతారంలోని సాయిబాబా దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివ పంతులు నేతృత్వంలో సాయిబాబా, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, సంగమేశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేసి, షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.