వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో జరిగిన గంపల బాలేష్ (45) హత్య కేసులో నిందితుడు అప్పల సాయిలు పోలీసులకు లొంగిపోయాడు. సాయిలు భార్యతో బాలేష్‌కు వివాహేతర సంబంధం ఉండటమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత పరారైన సాయిలును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ వెల్లడించారు.