కవర్ల గుడిసెలో జీవితం… ఇందిరమ్మ ఇల్లు కావాలని వేడుకోలు

1చూసినవారు
నర్సాపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చాకలి బాలయ్య కుటుంబం సొంత ఇల్లు లేక దయనీయ పరిస్థితుల్లో జీవిస్తోంది. కవర్లతో కప్పిన గుడిసెలోనే ఎండ, వానల నుంచి రక్షణ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాలయ్య, ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్