సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపిన కార్యకర్తల కుటుంబాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబాలకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.