బతుకమ్మను అలంకరించిన ఎమ్మెల్యే

340చూసినవారు
సద్దుల బతుకమ్మ సందర్భంగా, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం శివ్వంపేట మండలంలోని గోమారంలో బతుకమ్మను అలంకరించారు. ప్రతి సంవత్సరంలాగే, ఈ ఏడాది కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తుందని ఆమె తెలిపారు.