
అమెజాన్లో మరో 84 మంది ఉద్యోగులకు కోత
అమెజాన్ కంపెనీ వాషింగ్టన్లో మరోసారి ఉద్యోగాల కోత విధించింది. ఈసారి 84 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ తొలగింపులు ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 23 మధ్య జరగనున్నాయి. సియాటెల్, బెల్లేవ్ ఆఫీస్, వాషింగ్టన్లో ఉన్న రిమోట్ ఉద్యోగులపై ఈ కోత ప్రభావం ఉంటుంది. తొలగించనున్న ఉద్యోగులకు 90 రోజుల పూర్తి జీతం, ప్రయోజనాలు, ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. గత అక్టోబర్లో ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.




