నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గేటు సమీపంలో సోమవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో మెదక్‌కు చెందిన మధు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, ఈఎంటీ అలీముద్దీన్, పైలట్ సురేష్ ప్రథమ చికిత్స అందించి, మధును నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.